ఆర్ఆర్ఆర్ స్పెష‌ల్ గ్లిమ్స్ అదిరిపోయింది..

  83
  0
  rrr glimpse

  ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా, రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలివీయా మోరీస్ త‌దిత‌రులు న‌టిస్తుండ‌గా.. ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

  డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని, జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పోస్టర్లు .. స్పెషల్ వీడియోలు అంతకంతకు అంచనాలు రెట్టింపు చేస్తూ వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఆంగ్లేయుల ఆధిపత్యం .. అల్లూరి సీతారామరాజు .. కొమరం భీమ్ ల తిరుగుబాటు ..

  ఎవరిబాటలో వారు సాగించిన పోరాటం తాలూకు విజువల్స్ తో ఈ గ్లింప్స్ కొనసాగింది. ప్రధానమైన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ .. కంటెంట్ ఏమిటనే విషయాన్ని అర్థమయ్యేలా చెబుతూ కట్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ గ్లింప్స్ చూసిన వారంద‌రూ చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేయ‌డం వాట‌ని ఆర్ఆర్ఆర్ అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ పేజీలో ట్వీట్ చేస్తున్నారు.

  https://studio.youtube.com/video/fviqo-HxnpA/edit

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here