పునీత్ రాజ్‌కుమార్ స‌మాధి ద‌గ్గ‌ర క‌న్నీళ్లు పెట్టిన హీరో సూర్య‌..

  143
  0
  Surya

  కన్నడ సూప‌ర్‌స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29న) హార్ట్ అటాక్‌తో మృతి చెందిన విష‌యం తెలిసిందే. అప్పు అకాల మరణంతో కన్నడ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణాన్ని అటు కుటుంబసభ్యులు.. ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పునీత్ కుటుంబసభ్యులను వరుసగా తెలుగు, తమిళ్ హీరోలు వెళ్లి పరామర్శిస్తున్నారు.

  ఇప్పటికే నాగార్జున, రామ్ చరణ్ పునీత్ సమాధిని సందర్శించి.. ఆయన కుటుంబసభ్యులకు దైర్యం చెప్పారు. తాజాగా ఈరోజు తమిళ్ స్టార్ హీరో సూర్య పునీత్ సమాధిని సందర్శించారు.. జైభీమ్ సినిమా విడుదల సందర్భంగా బిజీగా ఉన్న సూర్య పునీత్ అంత్యక్రియలకు హజరుకాలేకపోయారు.

  శుక్రవారం ఆయన బెంగుళూరు వెళ్లి పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇక శివరాజ్ కుమార్‏తో కలిసి.. పునీత్ సమాధి వద్దకు వెళ్లారు. ఆయమ సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు. పునీత్ సమాధిని చూడగానే.. హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. సమాధి వద్దే నిల్చోని కన్నీళ్లు పెట్టుకున్నారు. పునీత్‏తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని హీరో సూర్య కన్నీటి పర్యంతం అయినట్లుగా తెలుస్తోంది.

  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోవైపు… పునీత్ అకాలమరణించారనే వార్తను అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.. సోషల్ మీడియాలో పునీత్ రాజ్ కుమార్ రేర్ ఫోటోస్.. వీడియోస్ మాత్రమే కాకుండా.. వివిధ రకాలుగా ఆయన నివాళులర్పిస్తున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here