క‌మెడియ‌న్ సునీల్‌ లేటేస్ట్ లుక్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

  125
  0
  Sunil

  ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘పుష్పస . ఈ సినిమా నుంచి సునీల్ పోస్టర్ విడుద‌లైంది. సినిమాలో సునీల్ ‘మంగళం శ్రీను’ అనే పాత్రలో న‌టించాడు. ఆయ‌న లుక్ మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా చాలా ప్రత్యేకంగా ఉంది. ఎర్ర‌ని క‌ళ్లు, చేతికి ఉంగ‌రాల‌తో ఆయ‌న ఫోనులో మాట్లాడుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోన్న తీరు అల‌రిస్తోంది.

  భ‌యంక‌రంగా ఆయ‌న క‌న‌ప‌డుతోన్న తీరు చూస్తోంటే ఈ సినిమాలో సునీల్.. ఈ సినిమా ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ లా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నట్లు తెలుస్తోంది. విల‌న్ పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఉంద‌ని గ‌తంలోనూ సునీల్ చాలా సార్లు చెప్పాడు. ఇక ఈ చిత్రంలో అల్లుఅర్జున్ స‌ర‌స‌న బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..

  హాట్ యాంక‌ర్ అన‌సూయ ఓ కీల‌క‌పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ‌ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం పార్ట్‌1 డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here