మాస్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి..

  98
  0
  Chiru154

  మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. శ‌నివారం హైద‌రాబాద్‌లో ఈ వేడుకను నిర్వ‌హించారు చిత్ర‌యూనిట్‌. చిరంజీవికి ఈ సినిమా 154వ చిత్రం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు పూరి జ‌గ‌న్నాథ్ స్విచ్చాన్ చేయ‌గా.. వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్టారు. కె. రాఘ‌వేంద్ర‌రావు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. డైరెక్ట‌ర్ల్ కొర‌టాల శివ‌, హరీశ్‌శంక‌ర్‌, మెహ‌ర్ ర‌మేశ్‌, బుచ్చిబాబు, శివ నిర్వాణ క‌లిసి స్క్రిప్ట్‌ని చిత్ర‌బృందానికి అంద‌జేశారు. నాగబాబు, ఛార్మి, బుచ్చిబాబు, బి.వి.ఎస్‌.రవి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు.

  మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మాస్‌ అవతారంతో ఒకప్పటి చిరంజీవిని గుర్తు చేసేలా పోస్టర్‌ని సిద్ధం చేసి ‘అరాచకం ఆరంభం’ అనే వ్యాఖ్యతో విడుదల చేసింది చిత్రబృందం. డిసెంబర్‌లో చిత్రీకరణ ఆరంభిస్తారు. మాస్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్ధర్‌.ఎ విల్సన్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కూర్పు: నిరంజన్‌ దేవరమనే, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సుస్మిత కొణిదెల, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కథ, మాటలు: బాబీ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, కె.చక్రవర్తిరెడ్డి, పోరాటాలు: రామ్‌లక్ష్మణ్‌, సహనిర్మాత: జి.కె.మోహన్‌.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here