భోళా శంక‌ర్ షురు.. మెగాస్టార్ స‌ర‌స‌న త‌మ‌న్నా బ్యూటీ!

  133
  0
  megastar

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళాశంకర్’ చిత్రం నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిరంజీవిపై క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును చిత్రబృందానికి అందించారు.

  ఈ కార్యక్రమానికి తమన్నా, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, వీవీ వినాయక్, బాబీ కూడా హాజరయ్యారు. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వేదాళం’ చిత్రాన్ని తెలుగులో ‘భోళాశంకర్’ గా రీమేక్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది.

  త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ కు ఇది రీమేక్. గాడ్ ఫాదర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదలైన ప్రీ లుక్ కు విపరీతమైన స్పందన వచ్చింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here