Home movie news వి.వి.వినాయక్ చేతులమీదుగా ప్రారంభమైన “యూజ్ ఫుల్ ఫెలోస్”

వి.వి.వినాయక్ చేతులమీదుగా ప్రారంభమైన “యూజ్ ఫుల్ ఫెలోస్”

460
0

వి.ఆర్ జి ఆర్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 లో నూతన నటీనటులతో ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్, మహేష్ గంగిమల్ల దర్శకులను పరిచయం చేస్తూ  గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్న “యూజ్ ఫుల్ ఫెలోస్” మరియు హారర్ చిత్రాల పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, ఐ.ఏ.యస్, ఐ.పి.యస్  ఆఫీసర్స్ యం.వి. భాస్కర్ రావు, టి. చిరంజీవులు, వై. గంగాధర్, జి.లక్ష్మి ప్రసాద్, యం. జగన్నాధం, టి.విక్రమ్, జె.ప్రభాకర్ రావు, లతో పాటు వినయ్ కుమార్ లు మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.పూజా కార్యక్రమాలు అనంతరం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్  హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఆడిషనల్ సెక్రెటరీ కాళీ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ టి.చిరంజీవులు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ పూజా కార్యక్రమాలు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న,
ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ మాట్లాడుతూ.. ఒకే సారి రెండు చిత్రాలు నిర్మిస్తూ ఇద్దరి దర్శకులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. జిబి నాయుడు నిర్మిస్తున్న ఈ రెండు చిత్రాలు గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేసారు.
చిత్ర నిర్మాత జిబి నాయుడు మాట్లాడుతూ.. నన్ను, మా బ్యానర్ ను బ్లెస్స్ చేయడానికి వచ్చిన ఐ.ఏ.యస్., ఐ.పి.యస్  ఆఫీసర్లకు ధన్యవాదాలు.నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం ఉండడంతో దర్శకులు మహేష్ గనిగళ్ల, ఫిల్మీ గ్యాంగస్టర్స్ చెప్పిన కథలు నచ్చడంతో  మా వి.ఆర్.జి.ర్ మూవీస్ పతాకంపై హర్రర్ కథాంశంతో ఒక సినిమా, యూత్ ఫుల్ సబ్జెక్ట్ లతో నూతన దర్శకులతో ఒకేసారి రెండు సినిమాలు నిర్మిస్తూ ఇద్దరు దర్శకులతో పాటు కొత్త ఆర్టిస్టులను,టెక్నిసిషన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో నటీనటుల వివరాలు తెలియజేస్తాము.మంచి కాన్సెప్ట్ తో నిర్మిస్తున్న ఈ రెండు చిత్రాలు గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ..ఇక ముందు మా బ్యానర్లో ప్రేక్షకులను అలరించే విధంగా .ఇలాంటి మంచి సినిమాలు తీస్తాము అని అన్నారు
చిత్ర దర్శకుడు మహేష్ గంగిమల్ల మాట్లాడుతూ.. నేను చెప్పిన కథ నచ్చడంతో నాకిలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత జిబి నాయుడుకు ధన్యవాదాలు. ప్రతి మనిషి మారాలి అనుకుంటాడు కానీ అది కస్టమైన పని. కానీ కొన్ని సార్లు పరిస్థితులే వారిని మారుస్తాయి.అలా అప్పటి వరకు యూజ్ లెస్ ఫెలోస్ గా ఉన్న వారు పరిస్థితులు వల్ల యూజ్ ఫుల్ ఫెలోస్  గా ఎలా మారారు అనేదే ఈ చిత్ర కథాంశం.
మాటల రచయిత మాధవ్ కోదాడ మాట్లాడుతూ..ఈ సినిమాకు నేను కథ, మాటలు అందించాను.ఒకేసారి రెండు చిత్రాలు నిర్మిస్తున్న జిబి నాయుడు గారు పెద్ద నిర్మాత అవ్వాలని అన్నారు.
హీరోయిన్ మిహిర మాట్లాడుతూ.. నటనకు మంచి స్కోప్ వుండే ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ.ఏ.యస్., ఐ.పి.యస్  ఆఫీసర్లు ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
సాంకేతిక నిపుణులు:
ప్రొడ్యూసర్ :గొంగటి వీరాంజనేయ నాయుడు(జి.బి.నాయుడు)
డైరెక్టర్స్ : మహేష్ గంగిమల్ల,ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్
ఫోటోగ్రఫీ : జయపాల్ నిర్మల
కథ స్క్రీన్ పై మాటలు : మాధవ్  కోదాడ.
PRO : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here