Home movie news “త్రిగుణ్” గా పేరు మార్చుకున్న యంగ్ హీరో అదిత్ అరుణ్

“త్రిగుణ్” గా పేరు మార్చుకున్న యంగ్ హీరో అదిత్ అరుణ్

223
0

డిఫరెంట్ మూవీస్ తో, సర్ ప్రైజ్ చేసే క్యారెక్టర్స్ తో తెలుగు
ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అదిత్ అరుణ్. ఆయన
నటించిన వీకెండ్ లవ్, తుంగభద్ర, పీఎస్ వీ గరుడ వేగ, డియర్ మేఘ, “డబ్ల్యూ
డబ్ల్యూ డబ్ల్యూ” లాంటి చిత్రాలు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ
యంగ్ టాలెంటెడ్ తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు.

రీసెంట్ ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ అనౌన్స్ చేశారు. ఇకపై
తనను మీడియా మిత్రులు, చిత్ర పరిశ్రమలోని స్నేహితులు, పెద్దలు త్రిగుణ్
గా పిలవాలని ఈ యంగ్ హీరో కోరారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ
రూపొందిస్తున్న “కొండా” చిత్రంలో నటిస్తున్న త్రిగుణ్..ఈ సినిమా తన
కెరీర్ లో డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని చెబుతున్నారు. కొండా ట్రైలర్
విడుదలకు సిద్ధమవుతున్న టైమ్ లో త్రిగుణ్ గా పేరు మార్చుకోవడం రైట్ టైమ్
గా భావించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here