Home movie news Rk టాకీస్ బ్యానర్‌పై ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో ప్రారంభమైన ప్రొడక్షన్ నెంబర్ 2

Rk టాకీస్ బ్యానర్‌పై ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో ప్రారంభమైన ప్రొడక్షన్ నెంబర్ 2

286
0
నేటితరం ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో చిన్న సినిమాల పాత్ర ఎక్కువగా ఉంటోంది. కొత్త కొత్త కథలతో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు అప్‌కమింగ్ దర్శకనిర్మాతలు. ప్రేక్షకుల టెస్ట్‌కి తగ్గట్టుగా కథ రెడీ చేసుకొని సక్సెస్ అవుతున్నారు. అదే బాటలో తాజాగా ఓ సినిమా స్టార్ట్ చేశారు డైరెక్టర్ నర్సింహా వడ్డే. పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆయన.. నిర్మాత పులకుర్తి కొండయ్యతో కలిసి ఓ డిఫరెంట్ స్టోరీని ఆవిష్కరించబోతున్నారు.
రవి కిరణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ Rk టాకీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఇదే బ్యానర్‌పై గతంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా వచ్చిన ‘ప్రియతమ’ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే ఎనర్జీతో మరో సినిమా షురూ చేశారు. మనీ బ్యాక్‌డ్రాప్‌లో ఆడియన్స్ థ్రిల్ అయ్యే కథను సిద్ధం చేసిన దర్శకనిర్మాతలు తాజాగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠభరితంగా ఉంటుందని, టెక్నీషియన్స్, ఆర్టిస్టుల వివరాలు అతి త్వరలో ప్రకటిస్తామని నిర్మాత పులకుర్తి కొండయ్య తెలిపారు. ఈ కథ అందరినీ అక్కట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here