యువ సంచలనం విజయ్ దేవరకొండ, అగ్ర నటి సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాను అతి త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ జంట ఇంతకు ముందు టాలీవుడ్ క్లాసిక్ మహానటిలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తల తో, విజయ్ దేవరకొండ మరియు సమంతల మ్యూచువల్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ జన గణమన సినిమా పూర్తి చేయగానే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా, సమంత ప్రస్తుతం యశోద షూటింగ్‌లో బిజీగా ఉంది.