రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది వారియర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ ను దర్శకుడు లింగుస్వామి చూపించబోతున్నారు. అయితే, రామ్ క్యారెక్టర్ కి సంబంధించి తాజాగా ఒక అప్ డేట్ వినిపిస్తోంది. రామ్ క్యారెక్టర్ కి మతిమరుపు అని, దాంతో చేసే కొన్ని పొరపాట్లు కారణంగా ఫుల్ ఫన్ జనరేట్ అవుతుంది అని తెలుస్తోంది.
ఇప్పుడీ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి, దీనికి తోడు రామ్ ఫస్ట్ లుక్ కు ఇప్పటికే అద్భుత స్పందన వచ్చింది. ఎలాగూ కథ – కథనం పరుగులు పెట్టిస్తూ… సినిమాలు తీయడంలో లింగుస్వామి మంచి స్పెసలిస్ట్. అందుకే.. ‘ది వారియర్’ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అన్నిటికి మించి టాప్ టెక్నీషియన్లు, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.