వినీత్ కుమార్, జబర్దస్త్ నాగిరెడ్డి, జీవా, సీకా ప్రధాన పాత్రధారులుగా త్రివేది ప్రొడక్షన్స్ పతాకంపై వినీత్ కుమార్ దర్శకత్వంలో త్రివేది ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘బెంగుళూరు హైవే’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇది యథార్ధంగా బెంగుళూరు హైవేపై జరిగిన కథ ఇది. క్రైమ్, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. మా సినిమా చాలా బాగా అవుట్ పుట్ వచ్చింది. దీనికంతటికీ కారణం మా నిర్మాత. ఎక్కడా మేమనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టి తీశాం. ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతంగా వుంటుంది. అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది” అని అన్నారు.
కథ, స్క్రీన్ ప్లే విమల్ కుమార్ మాట్లాడుతూ “ఈ కథ రియల్ స్టోరీని తీసుకుని సినిమాగా తెరకెక్కించాం. మా దర్శకనిర్మాతలు చాలా బాగా తీర్చిదిద్దారు. సినిమాని. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. మంచి చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం మాకుంది” అని అన్నారు.
కెమెరా : అభి పియ్యల, సింగర్ : గుంజన్ ప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్ : టి. జ్యోతి, కథ, స్క్రీన్ ప్లే : విమల్ కుమార్, సంగీతం : సుకుమార్, నిర్మాణం : త్రివేది ప్రొడక్షన్స్, దర్శకత్వం : వినీత్ కుమార్ త్రివేది.