Home movie news ఇరు తెలుగు రాష్టాల సిఎం లు అతిధులుగా పాన్ ఇండియా స్దాయిలో మే 4 దాసరి...

ఇరు తెలుగు రాష్టాల సిఎం లు అతిధులుగా పాన్ ఇండియా స్దాయిలో మే 4 దాసరి నేషనల్ ఫిల్మ్ అండ్ టీవి నేషనల్ అవార్డ్స్

345
0

దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు జయంతి ని పురస్కరించుకుని దాసరి కల్చరల్ ట్రస్ట్ , ఇమేజ్ ఫిలింస్ సంయుక్తంగా దాసరి పేరిట అవార్డ్స్ ను ప్రధానం చేయనున్నారు.‌

నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ‌నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టివి నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాము.పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ భాషా చిత్రాల టెక్నిషియన్స్ కు దాసరి నేషనల్ అవార్డ్ లను ప్రధానం చేయబోతున్నాము. ఇందుకోసం ఇప్పటికే “దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్” ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నాము.భారీ స్దాయిలో హైదరాబాదు లోనె జరగనున్న ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల సిఎ‌ం లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నాము..వేదిక మరియు అవార్డు కమిటీ కి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియచెస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here