దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్”. భారీ అంచనాలతో మార్చి 25న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచస్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా దుబాయ్‌కి చెందిన మూవీ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని చెబుతూ తన ఫస్ట్ రివ్యూని చెప్పేశాడు.
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ పాత్ర సినిమాకు ఆత్మ వంటిదని, రామ్‌చరణ్ తన నటనతో టెరిఫిక్‌గా కనిపించాడని.. ఇది డెడ్లీ కాంబో అని అన్నారు. తన కలలకు ప్రతి రూపంగా రాజమౌళి ఈ సినిమాను రూపొందించారని.. భారతీయులు గర్వపడేలా సినిమా ఉందని, బాక్సాఫీస్ దగ్గర మంటలు రేగడం ఖాయమని ఉమైర్ సంధు తెలిపాడు.