Home movie news మీమర్స్ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ : రాజమౌళి

మీమర్స్ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ : రాజమౌళి

113
0

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా .. దర్శకధీరుడు రాజమౌళి మలిచిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆర్.ఆర్.ఆర్’. మరో మూడు రోజుల్లో చిత్రం థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. ఈ సినిమాని ఎప్పుడు చూసేద్దామా అన్నంత ఆత్రుతగా ఉన్నారు అభిమానులు. దేశం మొత్తం సినిమాపై ఆసక్తిగా ఉంది. ఈ నేపథ్యంలో జక్కన్న , తారక్, చెర్రీలు ప్రమోషన్స్ తో హల్ చల్ చేస్తున్నారు.  ప్రస్తుతం నార్త్ లో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో తిరుగుతూ తమ సినిమాని తెగ ప్రమోట్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘ఆర్.ఆర్.ఆర్’ త్రయం తారక్, చెర్రీ, రాజమౌళిలతో ఈ సినిమాపై మూడేళ్ళుగా వస్తున్న మీమ్స్ పై సరదాగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది యాంకర్ సుమ.

ఎంతో సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో తమపై వచ్చిన మీమ్స్ ను స్ర్కీన్ పై చూసి ముగ్గురూ తెగ నవ్వుకున్నారు. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యేంత వరకూ వచ్చిన మీమ్స్ ను తెగ ఎంజాయ్ చేశారు. అలాగే.. ఈ సినిమా చిత్రీకరణలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ ను జక్కన్న ఆమెతో షేర్ చేసుకున్నారు. అలాగే.. రాజమౌళి సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన మాటల్ని సింక్ చేస్తూ .. వెంకీ సినిమాలోని రవితేజ డైలాగ్స్ తో చేసిన మీమ్స్ కు ముగ్గురూ పడిపడీ నవ్వారు.  ఈ సందర్భంగా రాజమౌళి మీమర్స్ కు ధన్యవాదాలు తెలియచేశారు.  మీమర్స్ ను ఇంత క్రియేటివిటీగా చేయడం మామూలు విషయం కాదని, వారి క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ అని అన్నారు. ఇంకా యాంకర్ సుమపై తారక్ పంచుల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here