Home movie news డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో పవర్ తుఫాన్ మొదలు, స్ట్రీమింగ్ లో భీమ్లా నాయక్...

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో పవర్ తుఫాన్ మొదలు, స్ట్రీమింగ్ లో భీమ్లా నాయక్ సంచలనం

188
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ ఓటీటీ
తుఫాన్ మొదలైంది. అవర్ ఫేవరేట్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో భీమ్లా నాయక్
స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్ లో సినిమాను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు
ఇంట్లో కుటుంబ సభ్యులతో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సినిమాను మరోసారి
చూస్తున్నారు.

తివిక్రమ్ పవన్ కాంబినేషన్ పవర్ ఫుల్ డైలాగ్స్ రిపీటెడ్ గా వింటూ
హ్యాపీగా ఫీలవుతున్నారు. త్రివిక్రమ్ కథనం మాటలు అందించగా..సితార ఎంటర్
టైన్ మెంట్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు సాగర్ కె చంద్ర రూపొందించిన
భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదలై థియేటర్ లలో పవర్ స్ట్రామ్ క్రియేట్
చేసింది.

బుధవారం అర్థరాత్రి నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో భీమ్లా నాయక్
స్ట్రీమింగ్ మొదలైంది. రాత్రి నుంచే ఫ్యాన్స్ టీవీల్లో సినిమాను
చూసేస్తున్నారు. అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య జరిగిన సంఘర్షణను
ఆస్వాదిస్తున్నారు. మలయాళ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను మనదైన స్టైల్ లో
చూపించిన భీమ్లా…ఓటీటీ రికార్డులు బద్దలు కొట్టేందుకు బయలుదేరింది. ఈ
సంచలనంలో మీరూ భాగమవ్వండి. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ పెట్టేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here