Home movie news మూడు రోజుల్లో 500 కోట్లను వసూలు చేసిన RRR

మూడు రోజుల్లో 500 కోట్లను వసూలు చేసిన RRR

268
0

భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామా, RRR, భారతీయ సినిమా చరిత్రలో సంచలనాత్మక చిత్రంగా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మావరిక్ ఫిల్మ్ మేకర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అత్యధికంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే 500 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. భారతదేశంలో విడుదలైన ఏ సినిమాకైనా ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి.

RRR చిత్రం సోమవారం పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, ఈ వారం విడుదల కి పెద్ద చిత్రాలేవి ఏమీ లేనందున వచ్చే వారాంతం వరకు సినిమా మరింత వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇదే తరహా వసూళ్లను రాబడితే, RRR చిత్రం ఈ వారాంతం నాటికి 1000 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. పాన్ ఇండియా మూవీని డివివి దానయ్య తన హోమ్ బ్యానర్ డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ పై భారీ స్థాయిలో నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here