కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇటీవల కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘మిస్టర్ లోకల్’ సినిమా 2019 మే 27న విడుదలయ్యింది. అయితే ఈ సినిమాలో నటించేందుకుగాను నాకు రూ.15 కోట్లు పారితోషికం ఇస్తానని ప్రముఖ నిర్మాత, గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజా ఒప్పందం కుదుర్చుకున్నారని.. కానీ రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.4 కోట్లను చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని మద్రాస్ హైకోర్టులో శివకార్తికేయన్ పిటిషన్ వేశాడు.
అయితే ఈ కేసుపై నిన్న కోర్టు విచారణ చేపట్టగా హీరో శివ కార్తికేయన్‌కి నిర్మాత జ్ఞానవేల్ రాజా రివర్స్‌లో షాకిచ్చాడు. శివ కార్తికేయన్ వలన తాను రూ.20 కోట్లు నష్టపోయానని జ్ఞానవేల్ రాజా పిటిషన్ దాఖలు చేశాడు. తనకు మిస్టర్ లోకల్ కథ నచ్చలేదని చెప్పినా వినకుండా శివ కార్తికేయన్ తనతో బలవంతగా ఈ సినిమా చేసేలా ఒత్తిడి తీసుకొచ్చాడని, అందుకే ఈ సినిమాను నిర్మించినానని జ్ఞానవేల్ రాజా తెలిపాడు. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతుండగా, ఇప్పుడే తనపై కేసు ఎందుకు పెట్టాడని ప్రశ్నించాడు. నేను నష్టపోయినందుకుగాను శివ కార్తికేయన్‌కు అపరాధం విధించి, తనపై ఉన్న కేసును కొట్టివేయాల్సిందిగా జ్ఞానవేల్ రాజా కోరాడు. ప్రస్తుతం ఈ ఇష్యూ కోలీవుడ్‌లో హాట్‌టాఫిక్‌గా మారింది