Home Entertainment ‘విజయ్ దేవరకొండ – సమంత’ సినిమా

‘విజయ్ దేవరకొండ – సమంత’ సినిమా

239
0

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 21న హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమంతో స్టార్ట్ కానుంది. అలాగే, 23 నుంచి కాశ్మీర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఈ చిత్రం ఆర్మీ నేపథ్యంలో ఉంటుందని, అందులో విజయ్ మేజర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే ఇందులో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. అయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ – సామ్ చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here