సౌత్ ఇండియా ఫేమస్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముంబై లో మగ బిడ్డ కి జన్మ నిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లీ కొడుకులిద్దరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు, కాజల్ మరియు ఆమె భర్త గౌతమ్ కిచ్లు తమ బిడ్డ కు నీల్ కిచ్లు అని పేరు పెట్టారని వార్తలు వచ్చాయి.
కాజల్ తన కొడుకుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో కూడా వైరల్‌గా మారింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తదుపరి ఆచార్య చిత్రం లో కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో కాజల్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.