Home Entertainment సురాపానం ( కిక్ అండ్ ఫన్ ) మూవీ Official Teaser

సురాపానం ( కిక్ అండ్ ఫన్ ) మూవీ Official Teaser

100
0
అఖిల్ భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై  సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన   సురాపానం ( కిక్ అండ్ ఫన్ ) మూవీ Official Teaser ని ప్రముఖ దర్శకులు సాగర్ కె చంద్ర గారు గురువారం సాయంత్రం 6 గం౹౹ లకు లాంచ్ చేశారు.
ఈ సందర్బంగా సాగర్ కె చంద్ర గారు మాట్లాడుతూ
సురాపానం ( కిక్ అండ్ ఫన్ ) టైటిల్ కి తగ్గట్టుగా సినిమా టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉందని  ,ఈ సినిమా  ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుని, మంచి థ్రిల్ తో పాటు వినోదాన్ని అందిస్తుందని తెలిపి  చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర దర్శకులు సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ సురాపానం ( కిక్ అండ్ ఫన్ ) సినిమా ఫాంటసీ థ్రిల్లర్ మరియు కంప్లీట్ కామెడి ఎంటర్టైనర్ అని తెలిపారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై  మొదటి సారిగా సరికొత్త కథాంశంతో వస్తున్న సురాపానం  సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని , తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం సినిమా సెన్సార్ లో ఉందని , మే చివరి వారంలో సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. చిత్రంలో హీరో హీరోయిన్ లుగా సంపత్ కుమార్ , ప్రగ్యా నయన్ లు నటించగా ప్రధాన పాత్రలలో అజయ్ ఘోష్ , సూర్య , ఫిష్ వెంకట్ , మీసాల లక్ష్మణ్ , చమ్మక్ చంద్ర , సురభి ప్రభావతి , త్రిపుర మరియు తదితరులు నటించినట్లు తెలిపారు .
ఈ కార్యక్రమంలో  మట్ట మధు యాదవ్, మట్ట రాజు యాదవ్ , సంపత్ కుమార్ గార్లతో పాటు నటుడు మీసాల లక్ష్మణ్ , విద్యాసాగర్ , గిరి పోతరాజు, ప్రణయ్ వంగరి మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here