COVID-19 మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంత నష్టపోయారో మనందరికీ తెలిసిందే..ఈ క్రమంలోనే డిజిటల్ రంగం ప్రజలకు అత్యంత చేరువ కావడంతో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటిటి లు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వెలసిన అనేక ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలను అలరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సినీ ప్రేక్షకులు కూడా భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే థియేటర్స్ కు వెళుతుండడంతో చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఓటిటి లో విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో అటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతుంది”డ్యూడ్”(DUDE) ఓటిటి. మే 1 న సినీ అతిరధుల చేతులమీదుగా గ్రాండ్ గా “డ్యూడ్”(DUDE) ఓటిటి యాప్ విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోలో “డ్యూడ్”(DUDE) ఓటిటి లోగోను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన లక్ష్మి (ఈశ్వర్ తల్లి), హైమా లు యాప్ స్పాన్సర్ చేయగా ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్ రాజీవ్, హీరోయిన్స్ డెబోరా డోరిస్ , హరిత, కమెడియన్ క్రేజీ అభి, డ్యూడ్ డైరెక్టన్ టీం చేతులమీదుగా “డ్యూడ్”(DUDE) ఓటిటి లోగోను విడుదల చేశారు.ఈ ఓటిటి లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న 10 మంది కొత్త దర్శకుల సినిమాల ట్రైలర్స్ ను ప్రదర్శించడం జరిగింది.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో
ఈ సందర్భంగా 24 క్రాఫ్ట్స్ లలో పట్టు సాధించిన దర్శక, నిర్మాత” డ్యూడ్”(DUDE) ఓటిటి వ్యవస్థాపకుడు ఈశ్వర్ మాట్లాడుతూ..ఈ రోజు “డ్యూడ్”(DUDE) ఓటిటి లోగోను తన తల్లి చేతులమీదుగా లాంచ్ చేయడం తమకు ఎంతో గర్వకారణం. ఇప్పటికే మార్కెట్ లో చాలా ఓటిటి లు వచ్చాయి. ఎన్ని ఓటిటిలు వచ్చినా కంటెంట్ ఉన్న ఓటిటి లకు ప్రేక్షకాదరణ లభిస్తుందనే విషయాన్ని ప్రేక్షకులు నిరూపిస్తున్నారు.”డ్యూడ్”(
ఈస్ట్ వెస్ట్ రాజీవ్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో సంవత్సరానికి 500 వినిమాలు షూటింగ్ జరుపుకుంటే అందులో 300 మాత్రమే విడుదలవ్వగా మిగిలిన 200 సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా కూడా విడుదలకు నోచుకువడం లేదు. అట్టి సినిమా కొరకు ఎంతో మంది ప్రాణం పెట్టి తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలనుకొనే నటీనటులు, టెక్నీషియన్స్ ల ప్రతిభ మరుగున పడిపోతుంది. ఇలా ఎంతోమంది యువత పడుతున్న బాధలను చూసి యువతకు మంచి ప్రోత్సాహం ఇస్తే వారి ప్రతిభకు అవకాశం కల్పిస్తే వారంతా సమాజానికి ఉపయోగ పడే ఎన్నో మంచి చిత్రాలు తీసుకువస్తారని భావించిన ఈశ్వర్ బాబు, ధూళిపూడి ముందు చూపుతో సరికొత్తగా “డ్యూడ్” (DUDE) ఓటిటి అనే ఫ్లాట్ ఫామ్ ను తీసుకురావడం హర్శించదగ్గ విషయం.ఇలాంటి చక్కని అవకాశం కల్పిస్తున్న ఈశ్వర్ ప్రోత్సహనికి సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీకు వచ్చే వారు ఎవరైనా అవకాశాలు లేవని వెనుతిరిగి పోకుండా “డ్యూడ్”(DUDE) ఓటిటి అండతో వారి ప్రతిభను నిరూపించుకోవాలని సూచిస్తూ నిస్వార్థ సేవతో అందరికీ అవకాశం కల్పించడానికి ముందడుగు వేసిన ఈశ్వర్ కు అల్ ద బెస్ట్ తెలియజేశారు..