టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి గారు అయిన కావలి శ్యామ్ సిద్ధార్థ్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ మృతి తో నిఖిల్ కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
శ్యామ్ సిద్ధార్థ్ మృతి తో టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని నిఖిల్ సిద్ధార్థ్ ఫ్యాన్స్, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. నిఖిల్ టాలీవుడ్ లో పలు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కార్తికేయ 2, 18 పేజెస్ లతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నారు. ఇటీవల స్పై అనే పాన్ ఇండియా చిత్రం తో రానున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.