గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. ప్రస్తుతం మైసూర్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్‌లో గోపీచంద్‌కు ప్రమాదం జరిగినట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మైసూర్‌లో జరుగుతున్న షూటింగ్‌లో కాలు కొద్దిగా స్లిప్ అవడంతో గోపీచంద్ పడిపోయారు. అయితే ఆయనకు ఏమీ కాలేదు. సురక్షితంగానే ఉన్నారు. అభిమానులు, స్నేహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని దర్శకుడు శ్రీవాస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. గోపీచంద్ నటిస్తున్న 30 వ చిత్రం ఇది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత.