మన టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోస్ లో మోస్ట్ డేడికేటివ్ గా అతి తక్కువ మంది ఉంటారు అలాంటి వారిలో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా ఒకరు. కేవలం తన దేహాన్ని మార్చుకోవడమే కాకుండా సినిమా సినిమాకి తనలోని నటనను కూడా బాగా మారుస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. రీసెంట్ గా అయితే శ్రీదేవి సోడా సెంటర్ తో ఆకట్టుకున్న ఈ నటుడు ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు.
అయితే ఈరోజు సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా అందులోని బై లాంగువల్ చిత్రం అనౌన్స్ అయ్యింది. ప్రముఖ నటుడు మరియు రచయిత అయినటువంటి హర్ష వర్ధన్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ చిత్రానికి ఒక ఆసక్తికర టైటిల్ “మామ మశ్చింద్రా” ని ఫిక్స్ చేసి సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఏదో సాంగ్ పాడుతూ మంచి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
అలాగే ఈ చిత్రంతోనే సుధీర్ బాబు ని మేకర్స్ నైట్రో స్టార్ గా పరిచయం చేస్తూ అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహిస్తున్నారు.