‘సర్కారు వారి పాట’(Sarkaru vaari paata) చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెట్టింట అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఒకప్పుడు వీడియో గేమ్స్ బాగా ఆడేవాడిననీ, ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నా అని మహేశ్ చెప్పారు.
1. వృత్తిని మార్చుకోవాల్సి వేస్త.. ఏ వృత్తిని ఎంచుకుంటారు?
నేను ఎప్పటికీ మహేశ్‌బాబు ది యాక్టర్‌గానే ఉండటానికి ఇష్టపడతా.
2. ఈ చిత్రంలో మీకు నచ్చిన అంశం?
హీరో క్యారెక్టరైజేషన్.
3. మార్వెల్ లేదా డీసీ.. దేన్ని ఎంచుకుంటారు?
మార్వెల్
4. మనీహెయిస్ట్‌లో ఇష్టమైన పాత్ర
ప్రొఫెసర్.
5. ఫ్యూచర్‌లో సితారను నటిగా చూడొచ్చా
ఇప్పటికే తను నటి అయిపోయింది.
6. ఎప్పుడు అంత ప్రశాంతంగా ఎలా ఉండగలరు?
ప్రశాంతంగా ఉంటాను కాబట్టి.
7. రోజులో ఫోన్‌కు కేటాయించే టైమ్
చాలా తక్కువ
8. మీ నుంచి సూపర్‌హీరో సినిమా ఆశించవచ్చా?
దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
9. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
నమ్రత నా బెస్ట్ ఫ్రెండ్ (Namratha)
10. మీ ఇంట్లో స్మార్ట్ పర్సన్ ఎవరు.
సితా పాప (Sitara)
11. ఎప్పుడైనా వేలం పాటలో పాల్గొన్నారా?
నో…
12. ఈ చిత్రంలో మీకు నచ్చిన డైలాగ్?
మెయిన్‌టెయిన్ చేయలేక దూల తీరిపోతుందయ్యా!
13. మీ భార్యలో బాగా నచ్చిన విషయం?
అన్నీ ఇష్టమే.. అందుకే పెళ్లాడా!
14. బిజీ షెడ్యూల్స్‌లోనూ పిల్లల కోసం సమయాన్ని ఎలా కేటాయించగలుగుతున్నారు?
ఎలా అంటే చెప్పలేను. కానీ పిల్లల కోసం వీలైనంత సమయాన్ని కేటాయిస్తా.
15. ఈ మధ్యకాలంలో ప్రభావితం చేసిన సినిమా?
ఆర్‌ఆర్‌ఆర్(RRR)