Home Entertainment ‘సర్కారు వారి పాట’ – సాగే సోషల్ యాక్షన్ డ్రామా !

‘సర్కారు వారి పాట’ – సాగే సోషల్ యాక్షన్ డ్రామా !

142
0

విడుదల తేదీ : మే 12, 2022

రేటింగ్ : 3/5

నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

దర్శకత్వం : పరశురాం పెట్ల

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట

సంగీత దర్శకుడు: థమన్ ఎస్

సినిమాటోగ్రఫీ: ఆర్ మధి

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సర్కారు వారి పాట. ఈ సినిమా రాక కోసం అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ చిత్రం ఈ రోజు అత్యధిక థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

మహేష్ (మహేష్ బాబు) యూఎస్‌లో లోన్ రికవరీ బిజినెస్ చేస్తుంటాడు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా డబ్బు విషయంలో మహేష్ ఎంతో నిబద్దతతో ఉంటాడు. అలాంటి మహేష్ ను మోసం చేసి కళావతి (కీర్తి సురేష్) అతని దగ్గర అప్పు తీసుకుంటుంది. డబ్బు తిరిగి చెల్లించకుండా చీట్ చేస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) ను కలుస్తాడు మహేష్. రాజేంద్రనాథ్ తనకు పదివేల కోట్లు అప్పు ఉన్నాడని మహేష్ మెలిక పెడతాడు. ఈ క్రమంలో కథ మలుపు తిరుగుతుంది. అసలు మహేష్ టార్గెట్ ఏమిటి? ఇంతకీ ఎవరు ఈ రాజేంద్రనాథ్? మహేష్ అతన్ని ఎలా హ్యాండిల్ చేశాడు? అసలు మహేష్ ఇదంతా దేని కోసం చేశాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగింది. మహేష్ కామెడీ టైమింగ్‌ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఇక తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటిలాగే మహేశ్ తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

ప్రధానంగా సినిమాలో ఇంటర్వల్ ఎపిసోడ్, మహేష్ – కీర్తి సురేష్ మధ్య వచ్చే లవ్ సీన్స్, మరియు కథను ఎలివెట్ చేస్తూ సాగిన మెయిన్ ట్రాక్, అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు,. పరుశురామ్ మార్క్ కామెడీ పంచ్‌ లు అండ్ మ్యానరిజమ్స్ సినిమాలో చాల బాగున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ నటన పరంగా తన గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది.

అలాగే కీలకమైన నదియా రోల్‌.. ఆ పాత్రలో ఆమె నటించిన విధానం ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. విలన్ పాత్రలో నటించిన సముద్రఖని ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు. వెన్నెల కిషోర్ తన కామిక్ హావభావాలతో కొన్ని చోట్ల నవ్విస్తారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు.

ఇక కామెడీని హ్యాండిల్ చేయడంలో గీత గోవిందంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పరుశురామ్, తనదైన మార్క్ కామెడీతో ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :

పరుశురామ్ కామెడీతో పాటు యాక్షన్ తో ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ విషయంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మంచి కథాంశం తీసుకుని కూడా ఆయన కథనం విషయంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. కొన్ని చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలు సినిమా స్థాయిని తగ్గించాయి. అలాగే, మెయిన్ ట్రాక్ లోని సీన్స్ కూడా వాస్తవానికి దూరంగా సాగాయి.

ఇక కొన్ని సీన్స్ లో కీర్తి సురేష్ ఓవర్ యాక్టింగ్ చేస్తోన్న భావన కలుగుతుంది. పైగా సినిమాలో ఉన్న కామెడీని.. సినిమా మొత్తం దర్శకుడికి కంటిన్యూ చేసే స్కోప్ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని సీక్వెన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమాలో మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. పరుశురామ్ దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. అయితే కథలో బలం లేకపోయినా, కామెడీతో సాగే వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు తమన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాలో విజువల్ పరంగా వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపధ్య సంగీతం కూడా బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సినిమాలో కొన్నిచోట్ల స్లోగా సాగిన కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.

తీర్పు :

ముందుగానే చెప్పుకున్నట్లు ఎన్నో భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ చిత్రం, మహేష్ అభిమానుల అంచనాలను అందుకోగలిగింది. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో అందరికీ కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ సోషల్ యాక్షన్ డ్రామాగా సాగుతూ సర్కారు వారి పాట మెప్పిస్తోంది. అన్నిటికి మించీ మహేష్ మరోసారి తన నటనతో అబ్బురపరిచాడు. అయితే బలమైన కథాంశంతో, పాత్రలతో ఆకట్టుకున్నప్పటికి.. కొన్ని సన్నివేశాలను మాత్రం దర్శకుడు నెమ్మదిగా నడిపించారు. పైగా సినిమాలో లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోదు. దీనికితోడు నాటకీయ సన్నివేశాలు, అలాగే కొన్ని చోట్ల స్లో కథనం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే మహేశ్ బాబు తన స్టైలిష్ పెర్పార్మెన్స్ తో తన అభిమానులను బాగా అలరిస్తారు. ఓవరాల్ గా ఈ చిత్రం మహేష్ బాబు ఫాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here