Home Entertainment విజయ్ దేవరకొండ, సమంత ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్ గా “ఖుషి”

విజయ్ దేవరకొండ, సమంత ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్ గా “ఖుషి”

40
0

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్
సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత ఆయనకు జోడీగా కనిపించనుంది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని
నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు.మంచి రొమాంటిక్
కామెడి గా రాబోతున్న ఈ సినిమా ఇటీవలే కాశ్మీర్ లో షూటింగ్
ప్రారంభించుకుంది.ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకు “ఖుషి” టైటిల్ ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ, సమంత
ఫస్ట్ లుక్  విడుదల చేశారు.  ఫస్ట్ లుక్ లో ఈ జంట లవ్లీగా
కనిపిస్తున్నారు.  విజయ్,సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా
మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో
గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ
సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు “ఖుషి” టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్
క్రియేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 23,2022 న తెలుగుతో పాటు
తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర
బృందం ప్రకటించారు.

ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్,
అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.

నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ,
రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య
ప్రదీప్ తదితరులు.

టెక్నికల్ టీమ్:

మేకప్: బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్: ఉత్తర్ కుమార్, చంద్రిక
ఫైట్స్: పీటర్ హెయిన్
రచనా సహకారం: నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: శివ నిర్వాణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here