Home Entertainment మెగాస్టార్ కి విలన్ గా విజయ్ సేతుపతి ?

మెగాస్టార్ కి విలన్ గా విజయ్ సేతుపతి ?

195
0

మెగాస్టార్ చిరంజీవితో యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడని తెలుస్తోంది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడట.

విజయ్ సేతుపతి గతంలో ‘సైరా’ సినిమాలో చిరంజీవి అనుచరుడిగా నటించాడు. ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో విజయ సేతుపతి పాత్ర రివీల్ అవుతుందట. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఐతే, ఈ వార్త పై ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది. చిరు – శృతి హాసన్ జోడీ నిజంగానే బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here