Home Entertainment జూన్ 24న థియేటర్లలో విడుదల కానున్న మెగా ఫిల్మ్ మేకర్ ఎంఎస్ రాజు ‘7 డేస్...

జూన్ 24న థియేటర్లలో విడుదల కానున్న మెగా ఫిల్మ్ మేకర్ ఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’

31
0

నిర్మాతగా సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్స్ ప్రేక్షకులకు అందించిన ఎం.ఎస్. రాజు దర్శకునిగా ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు.

తాజాగా, మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ దర్శకత్వం వహించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ జూన్ 24న విడుదల కి సిద్ధంగా ఉంది.

సుమంత్ అశ్విన్ హీరోగా, మెహర్ చాహల్ (తొలి పరిచయం) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

ఈ సందర్భంగా హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని హైదరాబాద్‌, బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలలో పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. డర్టీ హరి తరువాత మా నాన్న ఎం.ఎస్. రాజు గారి దర్శకత్వంలో రానున్న ఈ యూత్‌ఫుల్ కంటెంట్‌ సినిమా పై చాలా అంచనాలున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం, మునుపెన్నడూ చూడని గోవా అందాలు, ఆద్యంతం నవ్వించే కవ్వించే సన్నివేశాలతో అందరికీ నచ్చే యూత్ సినిమా ఇది.” అని అన్నారు.

సహ నిర్మాతలలో ఒకరైన జె. శ్రీనివాసరాజు మాట్లాడుతూ “మెగా ఫిల్మ్ మేకర్ మా ఎం.ఎస్.రాజు గారి దర్శకత్వంలో మెగా బానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో బ్లాక్ బస్టర్ డర్టీ హరి తరువాత రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలుండడంతో థియేటర్స్ లో నే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఆకట్టుకునే సన్నివేశాలు కథనాలతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని పూర్తి నమ్మకంతో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం” అని అన్నారు.

దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ “ఫైనల్ కాపీ మా చేతిలోకి వచ్చినా, కరోనా మూడవ వేవ్ ముందస్తు చర్యలు అలాగే మన పెద్ద సినిమాల విడుదల నేపథ్యంలో కచ్చితంగా థియేటర్ల లోనే విడుదల చేయాలన్న ధ్రుడ నిశ్చయంతోనే మా ‘7 డేస్ 6 నైట్స్’ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ఇంత సమయం తీసుకున్నాం. ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ తో ఈ చిత్రం కేవలం యూత్ కి మాత్రమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. కొత్త కథలతో రావాలన్న నా కోరిక మేరకు డర్టీ హరి లాంటి చిత్రం తరువాత ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ గా, అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. హీరో సుమంత్ అశ్విన్ ఇందులో పూర్తి భిన్నంగా పాత్రలో చాలా ఒదిగిపోయి నటించారు.  హీరోయిన్ మెహర్ చాహల్ మరో జంట రోహన్, క్రితికా శెట్టి తొలి పరిచయం అయినా అద్భుతంగా నటించారు పాత్రలకి పూర్తి న్యాయం చేసారు. ఈ నెల జూన్ 24న థియేటర్లలో విడుదల కానున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు.

ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కూర్పు: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్ , స్టిల్స్ : ఎం. రిషితా దేవి , పీఆర్వో: పులగం చిన్నారాయణ, డిజిటల్ ప్రమోషన్స్: సుధీర్ తేలప్రోలు, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో-డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here