Home Entertainment ప్రతి ఒక్కరూ కిరోసిన్ సినిమా చూసి ఎంతో థ్రిల్ ఫీల్ అవుతారు – హీరో, దర్శకుడు...

ప్రతి ఒక్కరూ కిరోసిన్ సినిమా చూసి ఎంతో థ్రిల్ ఫీల్ అవుతారు – హీరో, దర్శకుడు ధృవ

25
0
మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన సినిమా *కిరోసిన్*. పెళ్లి చూపులు, ఘాజీ, టెర్రర్, చెక్, చైతన్యం వంటి సినిమాలతో  తన నటన తో అందరిని ఆకట్టుకున్న *ధృవ* స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమాను బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ లు నిర్మించారు.  తాజాగా ఈ సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్.  సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేయగా సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా కు మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. జూన్ 17న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. కిరోసిన్ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. నేను గతంలో పోషించిన పాత్రల కంటే ఇది విభిన్నంగా ఉంటుంది. నా దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడం, అందులో నేనే హీరోగా ఉండడం ఎంతో సంతోషాన్నిస్తుంది. మరింత బాధ్యత ను పెంచింది. ఈ  సినిమా ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సినిమా పై మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. తప్పకుండా అందరూ ఈ సినిమా ను చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయి. జూన్ 17వ తేదీన థియేటర్లలోకి వస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి అన్నారు.
నటీనటులు :
ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్
నిర్మాతలు : దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్
కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ దర్శకత్వం:  ధృవ
 పీఆర్వో: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here