Home Entertainment ఆది సాయి కుమార్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “తీస్ మార్ ఖాన్” టీజర్...

ఆది సాయి కుమార్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “తీస్ మార్ ఖాన్” టీజర్ రిలీజ్

14
0
ఆది సాయి కుమార్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “తీస్ మార్ ఖాన్” టీజర్ రిలీజ్
యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు యూత్ మెచ్చే సినిమాల్లో నటించి మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు ఆది సాయి కుమార్. ఆయన తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ వదిలారు.
ఒక నిమిషం 34 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. మనం ఆపాలనుకున్నంత పవర్ మనదగ్గరున్నా.. మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది అనే డైలాగ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేస్తోంది. తీస్ మార్ ఖాన్ అంటూ ఈ వీడియోలో హీరో విభిన్న షేడ్స్ చూపిస్తూ సినిమాపై హైప్ పెంచేశారు. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కామెడీ టచ్ ఇస్తూ యాక్షన్ సీన్స్ చూపించిన విధానం సినిమాలో హైలైట్ అవుతుందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది.
ఇప్పటికే తీస్ మార్ ఖాన్ మూవీకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంలో ఆది మరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది.
ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో ఆది నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించనున్నారు.
నటీనటులు
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, పూర్ణ, అనూప్ సింగ్ ఠాగూర్, కబీర్ సింగ్, అర్జున్ అంబటి, ఆర్ జె హేమంత్, శ్రీకాంత్ అయ్యంగార్, అజీజ్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : విజన్ సినిమాస్
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ :  తిరుమల రెడ్డి
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్వో : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here