Home Entertainment జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న – ఏమైపోతానే- చిత్రం

జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న – ఏమైపోతానే- చిత్రం

16
0
సినిమా పరిశ్రమలో ఎన్నో రకాల జోనర్ లలో సినిమాలు వచ్చినా ప్రేమకథా జోనర్ సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతుంటుంది. ప్రేక్షకులలో మంచి ఫీలింగ్ ని కలిగించే ఈ సినిమాలు మంచి హిట్స్ అవుతూ ఉంటాయి కూడా.. అలా ఫీల్ గుడ్ ప్రేమకథగా తెరకెక్కిన సినిమా *ఏమైపోతానే*. అమర్ లతు, చాందిని పౌర్ణమి హీరో హీరోయిన్ లుగా  నటిస్తున్న ఈ సినిమా లో విజయ్  రామ్, జె. నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సురేష్ కుమార్ కుసిరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా కి వసంత్.జి సంగీతం సమకూర్చారు. కె. వెంకటేష్ సినిమాటోగ్రాఫర్ గా చేయగా శివ శార్వాణి ఎడిటింగ్ అందించారు. కాగా ఈ సినిమా జులై 1వ తేదీన విడుదల అవుతుంది.
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత *సురేష్ కుమార్ కుసిరెడ్డి* మాట్లాడుతూ.. ప్రేమకథా సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నాను. పాటలకు ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల ప్రీమియర్ షో కి వచ్చిన రెస్పాన్స్ కూడా మర్చిపోలేనిది. ఆరోజు అందరి స్పందన నాకు ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్ ను పెంచింది. ఈ సినిమా లో మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో నటించిన, పనిచేసిన అందరు కూడా ఎంతో బాగా సపోర్ట్ చేశారు. జులై 1 న ఈ చిత్రం అందరి ముందుకు రాబోతుంది. అన్నారు.
నటీనటులు
అమర్ లతు, చాందిని పౌర్ణమి, విజయ్  రామ్, జె. నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాత – సురేష్ కుమార్ కుసిరెడ్డి
రచన, దర్శకత్వం – సురేష్ కుమార్ కుసిరెడ్డి
మ్యూజిక్ – వసంత్.జి
సినిమాటోగ్రఫీ – కే .వెంకటేష్
ఎడిటర్ – శివ శార్వాణి
కో – డైరెక్టర్ – నాని బాబు
డిఐ – ఆర్యన్ మౌళి (ఆర్ట్ కలర్ ల్యాబ్)
మిక్సింగ్ – విష్ణు (కార్తికేయ స్టూడియో)
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here