రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో లక్ష్. ‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ సినిమా U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.
ఇటీవలే విడుదల చేసిన గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ వీడియోకి నెట్టింట భారీ ఆదరణ దక్కింది. ఈ సినిమా ఎంత పవర్ ఫుల్ సబ్జెక్టుతో రానుందో స్పష్టం చేస్తూ ఈ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు వదిలిన అన్ని అప్డేట్స్ భారీ స్పందన తెచ్చుకొని ఈ మూవీపై అంచనాలు క్రియేట్ చేశాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. వాడిప్పుడొక రక్తం మరిగిన పులిలాంటోడు.. అంటూ హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా ఉన్న శ్రీకాంత్ అయ్యంగార్ డైలాగ్స్ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి. ముంబై గ్యాంగ్ సెటిల్మెంట్స్ నేపథ్యంలో ఈ సినిమాను ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని స్పష్టమవుతోంది.
పొలిటికల్ పవర్ కోసం జరుగుతున్న పోటీలో ఓ గ్యాంగ్ ఎంటర్ కావడంతో అసలు కథ మొదలవుతుందని, ఈ గ్యాంగ్‌కి గంగరాజు లీడర్ అని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. మొత్తానికి గ్యాంగ్‌స్టర్ గంగరాజు స్నీక్ పీక్ సినిమాపై ఆసక్తి పెంచిందని చెప్పుకోవాలి. విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ స్నీక్ పీక్ చూస్తుంటే ఈ మూవీ కథ, కథనం చాలా డిఫరెంట్‌గా ఉంటుందని స్పష్టమైందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇకపోతే ఈ చిత్రంలో వేదిక దత్త, వెన్నెల కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, రవితేజ నన్నిమాల, సమ్మెట గాంధీ, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఇషాన్ సూర్య
నిర్మాత: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
సినిమాటోగ్రఫీ: కణ్ణ పి.సి.
సంగీతం: సాయి కార్తీక్
ఎడిటర్: అనుగోజు రేణుకా బాబు
ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్
కొరియోగ్రాఫర్స్: భాను, అనీష్
పి.ఆర్.ఓ: సాయి సతీశ్, పర్వతనేని రాంబాబు