Home Entertainment “టిల్లు నాయికతో రూల్స్ రంజన్ రొమాన్స్!

“టిల్లు నాయికతో రూల్స్ రంజన్ రొమాన్స్!

12
0
‘యస్.ఆర్.కళ్యాణ్ మండపం’ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు పాల్గొనగా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజాగా ఈ సినిమాకి హీరోయిన్ కూడా కన్ ఫార్మ్ అయ్యింది. ‘డి.జె.టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించనుంది. ‘యస్.ఆర్.కళ్యాణ్ మండపం’ తో కిరణ్ అబ్బవరం, ‘డి.జె.టిల్లు’ తో నేహా శెట్టి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘రూల్స్ రంజన్’ చిత్రంలో నటించనుండటంతో సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here