దీనమ్మా జీవితం మానవత్వం చచ్చిపోయింది భయ్యా’ అంటున్నారు పంజా వైష్ణవ్ తేజ్ (Panja vaishnav tej). ఆయన హీరోగా నటిస్తున్న మూడో చిత్రం ‘రంగరంగ వైభవంగా’ (Rangaranga vaibhavamga)లోని డైలాగ్ ఇది. ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. గిరీశయ్య (Geerisayya)దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో వైష్ణవ్ తేజ్ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. (Ketika sharma)
నన్నే చూస్తావ్…
నా గురించే కలలు కంటావ్…
నన్నే ప్రేమిస్తావ్
కానీ… నాతో మాట్లాడటానికి ఈగో… అని హీరోయిన్ కేతిక శర్మ చెప్పిన రొమాంటిక్ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.
ఫ్రెండ్: ‘ఏంటే కలిసొచ్చారు… కలిసిపోయారా?
కేతిక శర్మ: నువ్వెలా వచ్చావ్.. అని స్నేహితురాలు అడిగిన ప్రశ్నకు
ఫ్రెండ్: ఆటోలో…
కేతిక: మరి ఆటోవాడు నువ్వు కలిసిపోయారా? అంటూ సాగిన డైలాగులు నవ్వులు పూయించేలా ఉన్నాయి. టీజర్ ‘ఖుషి’ సినిమాను గుర్తు చేస్తోందని, వైష్ణవ్ తేజ్ మేనరిజం పవన్‌కల్యాణ్‌ను తలపిస్తోందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.