Home Entertainment జూలై 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానున్న కమల్ హాసన్ లేటెస్ట్...

జూలై 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానున్న కమల్ హాసన్ లేటెస్ట్ సెన్సేషన్ “విక్రమ్”

32
0

కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ విక్రమ్. ఈ చిత్రాన్ని
దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించారు. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక
పాత్రల్లో నటించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ
సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలించింది. తెలుగులోనూ సూపర్ హిట్
అయ్యింది విక్రమ్. ఈ సినిమాతో తిరిగి తన స్టార్ డమ్ ను ప్రూవ్
చేసుకున్నారు కమల్ హాసన్.

సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ..ఈ మూడు పాత్రలను ఏ
క్యారెక్టర్ ఎక్కడా తగ్గకుండా పోటాపోటీగా రూపొందించిన విధానం
ఆశ్చర్యపరిచింది. ఈ సూపర్ హిట్ మూవీ జూలై 8 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్
స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. థియేటర్ లో విక్రమ్ చూసిన
ప్రేక్షకులు తిరిగి ఓటీటీలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here