Home Entertainment శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భీమదేవరపల్లి బ్రాంచి రెండో షెడ్యూల్

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భీమదేవరపల్లి బ్రాంచి రెండో షెడ్యూల్

26
0
“భీమదేవరపల్లి బ్రాంచి ” ఇది పూర్తి ఆర్గానిక్ గ్రామీణ జీవన చిత్రం.రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించడమే లక్ష్యంగా తెరకెక్కుతున్న సహజ చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన  సంఘటన దేశవ్యాప్తంగా  సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్  ఆధారంగా ఈ సినిమాను”Neorealism” జానర్లో మేకింగ్ చేస్తున్నారు.ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం”భీమదేవరపల్లి బ్రాంచి” కావడం విశేషం. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా నిర్మిస్తున్న కంటెంట్ ఓరియంటెడ్ చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి.
గత ఇరవై రోజులుగా కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్ గ్రామంలో మరియు పరిసర ప్రాంతాల్లో కంటిన్యూగా రెండవ  షెడ్యూల్  షూటింగ్  జరుగుతోంది….
 సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభిరామ్, రూప, అంజి బాబు,రాజవ్వ,CSR, శుభోదయం సుబ్బారావు,
 పద్మ, ప్రసన్న,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్,  మల్లికార్జున్, మహి, వల్లి సత్య ప్రకాష్, మహేష్ వంటి పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
AB CINEMASS & NIHAL PRODUCTIONS  నిర్మిస్తోన్న  ఈ చిత్రానికి “మీ శ్రేయోభిలాషి”చిత్రంతో రచయితగా ఎన్నో  అవార్డులు అందుకుని అనేక విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన
రమేశ్ చెప్పాల ఈ సినిమాకు కథ ,మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు.
రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల. నిర్మాత : బత్తిని కీర్తిలత గౌడ్. సహ నిర్మాత: రాజా నరేందర్ చెట్లపెల్లి
 కెమెరా: చిట్టి బాబు. సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.ఎడిటర్: బొంతుల నాగేశ్వర్ రెడ్డి. పబ్లిసిటీ
డిజైనర్: ధని ఏలే  ఆర్ట్: మోహన్.
పీఆర్ఒ: శ్రీధర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here