మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “ది వారియర్”. తమిళ స్టార్ దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు సెట్ చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే మాస్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.
అయితే ఈ ట్రైలర్ మాత్రం ఒక స్యూర్ షాట్ హిట్ లా కనిపిస్తుండగా ఈ ట్రైలర్ కి తెలుగులో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుందని చెప్పాలి. టైర్ 2 హీరోస్ లో అయితే భారీ మొత్తంలోనే అని చెప్పాలి. కేవలం 12 గంటల్లో 73 లక్షలకి పైగా వ్యూస్ తో దూసుకెళ్తుంది.
ఇది మాత్రం మామూలుగా రెస్పాన్స్ కాదని చెప్పాలి. ఇక 24 గంటల్లో అయితే ఇంకెత అందుకుంటుందో కూడా చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.