Home Entertainment రెక్కీ 360″ టీజర్ విడుదల.. ఆద్యంతం ఉత్కంఠభరితం

రెక్కీ 360″ టీజర్ విడుదల.. ఆద్యంతం ఉత్కంఠభరితం

35
0
స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ *”రెక్కీ 360″* . శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని “కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు” అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహిస్తుండగా కమలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్ర్హున్నారు. ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా… క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్రలో ఆయన కనిపించనున్నాడు.
ఇకపోతే ఈ క్రైం థ్రిల్లర్ లో అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేయగా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశానికి ఎవరూ ఊహించని కొన్ని ట్విస్టులు జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
కాగా, ఈ *రెక్కీ 360* మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం 54 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ రేపుతోంది. చిత్ర కథా నేపథ్యం ఎలా ఉంటుందో చెబుతూ ప్రతి ఫ్రేమ్ కూడా ఆసక్తికరంగా మలిచారు. క్రైం నేపథ్యంలో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులు ఉంటాయని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ఇకపోతే ఈ *రెక్కీ 360* మూవీ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని మేకర్స్ అంటున్నారు.
ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని మేకర్స్ పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న ” *రెక్కీ 360″* చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
సాంకేతిక వర్గం
సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్
నిర్మాత: కమలకృష్ణ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా
ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున
పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్
కెమెరా: వెంకట్ గంగాధరి
ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు
ఆర్ట్: రాజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here