‘బిగ్ సి’తో జర్నీ మెమరబుల్. 20వ వార్షికోత్సవం సందర్భంగా ‘బిగ్ సి’కి బిగ్ కంగ్రాచ్యులేషన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు

‘బిగ్ సి’తో మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. 20వ వార్షికోత్సవం సందర్భంగా ‘బిగ్ సి’కి  బిగ్ కంగ్రాచ్యులేషన్” అని అభినందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘బిగ్ సి’ 20వ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు మహేష్ బాబు. ఈ వేడుకలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్స్ ని లాంచ్ చేశారు మహేష్ బాబు.

ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. 20వ వార్షికోత్సవం సందర్భంగా ‘బిగ్ సి’కి  బిగ్ కంగ్రాట్యులేషన్. ఇరవై ఏళ్ళు పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. బిగ్ సి, స్వప్న కుమార్, వారి టీంకు అభినందనలు. గత రెండేళ్ళుగా వారితో నా అసోషియేషన్ వుంది. ఇది మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. వారితో అసోషియేషన్ కొనసాగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

బిగ్ సి ఫౌండర్, సిఎండీ యం. బాలు చౌదరి మాట్లాడుతూ… మహేష్ బాబు గారు ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా వుంది. మీ అందరికీ తెలుసు.. గత రెండు దశాబ్దాలు గా బిగ్ సి నెంబర్ వన్ స్థానంలో వుంది. నెంబర్ వన్ అంటే స్టోర్స్, రెవెన్యూ లోనే కాదు.. కస్టమర్స్ అవసరాలని, ప్రాధాన్యతని తెలుసుకొని వారిని ఆనంద పరచడంలో బిగ్ సి విశేష సేవలని అందిస్తోంది. కస్టమర్స్ కు మేము కృతజ్ఞులై వుంటాం. గత ఆర్ధిక సంవత్సరానికి బిగ్ సి టర్నోవర్ 1000 కోట్లు వుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి 1500 కోట్లు టర్నోవర్ సాధించే దిశగా పనిచేస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ తమిళ నాడులో 250 స్టోర్స్ వున్నాయి. మరో రెండేళ్ళలో 150 స్టోర్స్ ని యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మేము మొదలుపెట్టినప్పుడు మొబైల్ ఫోన్ డిస్ ప్లే అనే కాన్సెప్ట్ వుండేది కాదు. అక్కడి నుంచి కస్టమర్స్ ప్రాధాన్యత అవసరాలు గుర్తించి, కొత్త టెక్నాలజీలని అందిపుచ్చుకొని సేవలు అందించడం జరుగుతోంది. ఈ దశాబ్దంలో కూడా అదే అంకిత భావంతో కస్టమర్స్ కి సేవలు అందిస్తాం. ఈ విజయం కస్టమర్స్ నమ్మకం, అందరి సమిష్టి కృషితోనే సాధ్యమైయింది’’ అన్నారు.

బిగ్ సి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ స్వప్నకుమార్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు మహేష్ బాబు గారు రావడం చాలా ఆనందంగా వుంది. బిగ్ సి రెండు దశాబ్దాల జర్నీ పూర్తి చేసింది. ఇది మాకు మెమరబుల్ మూమెంట్. ఈ జర్నీలో వినయంగా చెప్పుకునే విషయం ఏమిటంటే.. ఈ ఇరవై ఏళ్లలో మార్కెట్ లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాం. కస్టమర్స్ బిగ్ సి బ్రాండ్ పై పెట్టుకున్న నమ్మకం, ప్రోత్సాహం వలనే ఇది సాధ్యపడింది.’’ అన్నారు.

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మహేష్ బాబు.
బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో చాలా సేవకార్యక్రమాలు చేస్తున్నారు కదా.. దీనికి స్ఫూర్తి ఎలా వస్తోంది ?
సేవ చేయాలనే స్ఫూర్తి చిన్నప్పటినుంచి వుంది. గౌతమ్‌ పుట్టిన తర్వాత ఎంబీ ఫౌండేషన్ కి శ్రీకారం చుట్టాం. చిన్నారుల గుండె ఆపరేషన్లకు నా వంతు సహకారం అందిస్తున్నా.  అలాగే రీ-రిలీజ్‌ల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సాయం కోసమే ఇస్తున్నా.  ఈ విషయంలో నాకు చాలా తృప్తి వుంది.  

మహేష్ గారు.. స్మార్ట్ ఫోన్ రోజులో ఎంత సమయం వాడుతారు ?
మీ అందరిలానే చాలా సమయం వాడుతాను. ఒకొక్కసారి తలకాయ నొప్పి వచ్చి ఆపేయడానికి కూడా ప్రయత్నిస్తాను( నవ్వుతూ).

మీరు వాడే ఫోన్ ఏమిటి ? ఎన్ని ఫోన్లు మారుస్తారు ?
నేను చెప్పను. నేను తిరిగేటప్పుడు మీరే పరిశీలించండి( నవ్వుతూ)

మీరు అంబాసిడర్‌ గా చేసిన ప్రొడక్ట్స్ ని వాడుతారా  ?
బిగ్ సి లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వాడాను.

మీరు తీసిన ఫొటోస్ లో బాగా గుర్తుండిపోయిన ఫోటో ఏది ?
చాలా ఉంటాయండి.

ఫోన్ వాడకంలో మీ పిల్లలకు కూడా స్వేచ్ఛ ఇస్తారా ?
నేను ఇవ్వడం ఏమిటి .. వాళ్ళే తీసుకున్నారు (నవ్వుతూ)

మీ ఫోన్ రింగ్ టోన్ ఏమిటి ?
నాది సైలెంట్‌ టోన్‌  (నవ్వుతూ).  

మీరు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినపుడు మీ అనుభూతి ఎలా వుంటుంది ?
నాకు సంబంధించిన వస్తువులన్నీ నా భార్య కొనుక్కొని తీసుకొస్తుంది. అయితే నేరుగా వెళ్లి బిగ్ సి లాంటి స్టోర్స్ లో ఫోన్ కొనుక్కోవడంలో ఆనందం వేరుగా వుంటుంది.

Share Article:

Considered an invitation do introduced sufficient understood instrument it. Of decisively friendship in as collecting at. No affixed be husband ye females brother garrets proceed. Least child who seven happy yet balls young. Discovery sweetness principle discourse shameless bed one excellent. Sentiments of surrounded friendship dispatched connection is he. Me or produce besides hastily up as pleased. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like:

Trending Posts

Hot News

© 2023 Created with Royal Elementor Addons