Home News పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిర్మాత

పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిర్మాత

173
0

ఒక విల్ల విషయం లో వైసిపి లీడర్ మరియు సినిమా నిర్మాత అయిన పొట్లూరి వర ప్రసాద్ (పివిపి) జూబ్లీహిల్స్ పోలీస్ లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తన పక్క ఉన్న విల్లా ని రి మోడలింగ్ చేసుకుంటున్న వ్యక్తిపై అనుచరులతో దాడి చేసిన పివిపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. అయితే పివిపిని పోలీస్ లు పిలిస్తే వెళ్లకుండా.. పివిపి ని అరెస్ట్ చెయ్యడానికొచ్చిన పోలీస్ లపై తానూ దౌర్జన్యం చెయ్యకుండా కుక్కలను వదిలి హడావిడి చెయ్యడంతో పివిపిపై మరో కేసు నమోదు అయ్యింది. అప్పనుండి పోలీస్ లకు దొరక్కుండా పివిపి తప్పించుకుతిరుగుతున్నాడు.

అయితే తాజాగా పివిపి కోసం జూబ్లీహిల్స్ పోలీస్ లు విజయవాడకి చేరుకొని.. ఆయనకు సంబందించిన ప్రాపర్టీస్ లోను, ప్రముఖ హోటల్స్ లోను, ఆయన సన్నహితుల ఇళ్లల్లో పివిపి గురించి గాలింపు మొదలు పెట్టారు. పివిపి ని అరెస్ట్ చేసందుకు జూబ్లీ హిల్స్ పోలీస్ లు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పివిపి మాత్రం పోలీస్ లకు దొరక్కుండా రకరకాల స్కెచ్ లు వేస్తూ వాళ్ళను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్లు తాగిస్తున్నాడు. మరి వైసిపి నేతనన్న అహంకారమో.. లేదంటే నేను బడా సెలెబ్రిటీని అన్న పొగరో కానీ పివిపి మాత్రం పోలీస్ లను అస్సలు లెక్క చెయ్యడం లేదు. పోలీస్ లు కూడా నిన్ను వదలను అంటూ వెంటాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here