Home Stories అందరికీ స్ఫూర్తిగా సోను సూద్…

అందరికీ స్ఫూర్తిగా సోను సూద్…

269
0

ఫేస్ బుక్ లో ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకోలేదు.. ట్విట్టర్ లో ఎంతమంది ఫాలో అవుతున్నారో పట్టించుకోలేదు.. ఇన్ స్టా లో ఎంతమంది తన పిక్స్ చూస్తున్నారా అని అసలే అనుకోలేదు. సోషల్ మీడియాను స్టేటస్ కోసం.. కాలక్షేపం కోసం.. అంతకు మించి పబ్లిసిటీ కోసం వాడుకుంటున్న సెలెబ్రిటీలకు సోనూసూద్ ఓ మార్గదర్శిగా నిలిచాడు. సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్న పేద ప్రజల కష్టాలను చూసి.. వెంటనే స్పందించడమే కాదు.. వారికి సాయం కూడా గంటల్లో అందించేస్తున్నాడు. వలస కార్మికుల కష్టాలపై స్పందించిన సోనూ సూద్ కు ఇప్పటికే అభినందనల వెల్లువ కురిసింది. అంతటితో ఆగని సోనూ సూద్.. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన ప్రతి ఘటనను ఎంక్వయిరీ చేసి సాయం అందిస్తూ.. రియల్ హీరోగా నిలిచిపోయాడు. ఇప్పుడు మిగతా హీరోలు.. ముఖ్యంగా మన తెలుగు హీరోలు ఏం పీకుతున్నారనే చర్చ మొదలైంది.

ఎంతసేపూ.. షూటింగులు ఎప్పుడు మొదలెడదామా.. థియేటర్లు ఎప్పుడు తెరిపిద్దామా.. సినిమా ఎప్పుడు రిలీజ్ చేసుకుందామా.. డబ్బులు వసూలు చేసుకుందామా.. ఇదే యావ.. ఇదే ఆలోచన.. దాని కోసం సీఎంలను కలవడం.. ప్రెస్ మీట్లు పెట్టడం.. మళ్లీ దానికి కూడా సినీ పరిశ్రమలోని కార్మికులను ఆదుకోవడానికే ఇదంతా అని ఓ కలరింగ్ ఇవ్వడం.. ఇలా టాలీవుడ్ కరోనా బ్యాక్ గ్రౌండ్ లో తన గ్రౌండ్ చూసుకుంటోంది. తమ సినిమాలు ఎంత త్వరగా రిలీజ్ చేసుకుందాం.. ఓటీటీలో ఎంత రేటు తెచ్చుకుందాం అనే ఆత్రమే వారిలో కనపడుతోంది. రాంగోపాల్ వర్మ లాంటి సైకో డైరెక్టర్ ఒక రకంగా డబ్బులు సంపాదించుకుంటుంటే.. వాడిని వ్యతిరేకించడంలో.. ఇంకొందరు బిజీ అయిపోయారు. సోనూ సూద్ ను చూసైనా సిగ్గు తెచ్చుకుని.. టాలీవుడ్ ఏమైనా అడుగు ముందుకేస్తుందేమో చూడాలి. శ్రీమంతుడు సినిమా వచ్చినప్పుడు.. తెగ ఫీలైపోయి.. గ్రామాలు దత్తత తీసుకున్న హీరోలు, బిజినెస్ పర్సన్స్.. ఎంతవరకు అవి చేశారో తెలియదు. దత్తత పేరుతో.. బిల్డప్ ఇచ్చి ఇన్ కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందడం కాదు.. కరోనాతో కష్టాల్లో పడ్డ తెలుగు ప్రజలకు అండగా నిలబడండి.. అప్పుడే అసలైన శ్రీమంతులవుతారనే కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.

కరోనాను కట్టడి చేయడంలో.. ప్రభుత్వాలు విఫలమయ్యాయనేది ఎవరూ కాదనలేని మాట. ప్రభుత్వ ఆస్పత్రుల కెపాసిటీ సరిపోకపోవడం.. ప్రైవేటు ఆస్పత్రులు ఇక్కడ శవాల మీద పేలాలు ఏరుకోవడం.. వల్ల.. చాలా మంది ప్రజలు కోవిడ్ కు సరైన ట్రీట్ మెంట్, గైడెన్స్ లేక ప్రాణాలు కోల్పోవడం.. చాలా కుటుంబాలు అనాథ కుటుంబాలుగా మారిపోవడం కళ్ల ముందే జరుగుతోంది. అనేకమంది పనులు కోల్పోయి.. ఎలాంటి ఆదాయం లేక.. తిండి కోసం కూడా కష్టపడే రోజులొచ్చేశాయి. అనేకమంది ఉద్యోగాలు పోయి.. ఉద్యోగాలున్నా జీతాలు లేక.. నానా కష్టాలు పడుతున్నారు. కోవిడ్ సెంటర్లను మన టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు స్పాన్సర్ చేయొచ్చు. కోవిడ్ సెంటర్లు కొత్తవి పెట్టించొచ్చు.. బెడ్ లు పెంచొచ్చు.. ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయొచ్చు.. వెంటిలేటర్లను సరఫరా చేయొచ్చు. కోవిడ్ ట్రీట్ మెంట్ ఉచితంగా జనానికి అందించే ఏర్పాటు చేసి.. ఆ ఖర్చును భరించొచ్చు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నవారిని.. ఇంకా రకరకాల కష్టాల్లో ఉన్నవారిని కేటగిరీల వారీగా డివైడ్ చేసి.. ఎవరికి వారికి తగిన సాయాన్ని అందించొచ్చు. టెక్నాలజీ ఉంది.. ఇంటర్ నెట్ ఉంది.. సోషల్ మీడియా ఉంది.. ఇలాంటివి ఆర్గనైజ్ చేయడం పెద్ద కష్టం కాదు. కావాల్సిందల్లా టాలీవుడ్ వారు గొప్ప మనసుతో స్పందించడమే.. వారి ఆస్తులు కాస్తయినా కరగబెట్టడానికి వారి మనసులను ఒప్పించుకోవడమే.. అంతే.. ఆర్గనైజ్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తారు.. లేదా వారే చేయొచ్చు.. సోనూ సూద్ అందించిన స్ఫూర్తితో ఇప్పటికైనా అసలైన శ్రీమంతులు ముందుకు వచ్చి.. కోవిడ్ కోరల్లో చిక్కుకున్నవారిని ఆదుకుంటారని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here