Home Entertainment చంద్రబాబు లెక్కల్లో మిగిలేది వాళ్ళేనట…?

చంద్రబాబు లెక్కల్లో మిగిలేది వాళ్ళేనట…?

515
0

చంద్రబాబు నిజంగా గొప్ప నాయకుడే. రాజకీయాల్లో ప్లస్ మైనస్ తెలిసిన నేత. అందుకే సుదీర్ఘ రాజకీయం ఆయన సొంతం అయింది. చంద్రబాబు ఇపుడు తన పార్టీకి ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు అన్నీ చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకుంటున్నారుట. తటస్థవాదిగా, యధార్ధవాదిగా ఉంటూ టీడీపీ ప్రస్తుత స్థితిని ఆయన మధింపు చేస్తున్నారుట. టీడీపీ నుంచి సీనియర్ నేతలు వరసగా వైసీపీలో క్యూ కడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఫ్యాన్ నీడకు చేరుతున్నారు. అలాగే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు. దాంతో అసలు టీడీపీలో ఎంత మంది ఉంటారు.. ఇదీ ఇపుడు చంద్రబాబు చేస్తున్న పోస్ట్ మార్టంగా చెప్పుకోవాలి.

అది ఖాయమా…

తన విపక్ష నేత పదవి పోతుందని కూడా బాబు గట్టిగా నమ్ముతున్నారుట. కేవలం 20 మంది మాత్రమే ఇపుడు పార్టీలో మిగిలారని, ఇందులో కూడా కనీసంగా ఏడెనిమిది మంది రానున్న రోజుల్లో గీత దాటేస్తారు అన్నది చంద్రబాబు వద్ద ఉన్న కచ్చితమైన సమాచారమట. 2024 ఎన్నికల దాకా కష్టమైనా నష్టమైనా తనతో నడచే వారు కేవలం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమేనని చంద్రబాబు భావిస్తున్నారుట. వారితోనే తన భవిష్యత్తు రాజకీయాన్ని కొనసాగించాలని కూడా బాబు అనుకుంటున్నారుట.

విశాఖలో ఆయనొక్కరే …

ఇక చంద్రబాబుకు ఉత్తరాంధ్రాలో నాలుగు సీట్లు ఇచ్చి పరువు నిలబెట్టిన విశాఖ సిటీ విషయంలో కూడా పెద్ద డౌట్లు ఉన్నాయిట. నలుగురు ఎమ్మెల్యేల్లో తూర్పు నుంచి గెలిచిన వెలగపూడి రామక్రిష్ణ బాబు ఒక్కరే కడదాకా టీడీపీలో ఉంటారని చంద్రబాబుకు గట్టి నమ్మకమట. అంటే మిగిలిన ముగ్గురు మీద కూడా పెద్దాయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనుకోవాలి. ఇందులో గంటా శ్రీనివాసరావు, మరో ఎమ్మెల్యే గణబాబుల మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి. కానీ బీసీ నేతగా ఉంటూ విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా గోడ దాటేస్తారు అని చంద్రబాబుకు ఎందుకు డౌట్ కొట్టిందో చూడాలి మరి.

వారేగా తమ్ముళ్ళు…

అదేదో సినిమాలో చిరంజీవి పాడినట్లుగా మీరేగా నా అసలైన తమ్ముళ్ళు అని ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలనే బాబు భావించుకుంటూ మురిసిపోతున్నారుట. వారిలో బావమరిది బాలయ్య ఎటూ ఉన్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రకాశం నుంచి గొట్టిపాటి రవికుమార్, కింజరాపు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు,ఆదిరెడ్డి భవానీ, వెలగపూడి రామక్రిష్ణబాబు, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, క్రిష్ణా జిల్లాకు చెందిన గద్దే రామ్మోహనరావు, మరో ఇద్దరు చంద్రబాబు లిస్ట్ లో ఉన్నారుట. వీరితోనే తాను 2024 ఎన్నికలవరకూ పోరాటం చేయాలని కూడా బాబు డిసైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది. అంటే బాబుకు 23 మంది ఎమ్మెల్యేలు జనం ఇస్తే సగానికి సగం జగన్ కి వదులుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యారనుకోవాలి. అలాగే విపక్ష నేత హోదా పోతుంది, తాను సామాన్య ఎమ్మెల్యే అవుతానని కూడా చంద్రబాబు ఊహిస్తున్నారు. మరి ఇన్ని అంచనాలు ఉన్న బాబు 2024 నాటికి పార్టీని ఏ విధంగా ధీటుగా తీర్చిదిద్దుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here