Home Entertainment బీజేపీ నాయకురాలు యామినీ శర్మ అరెస్టు

బీజేపీ నాయకురాలు యామినీ శర్మ అరెస్టు

514
0

తూ.గో.: బీజేపీ నాయకురాలు సాధినేని యామినీ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఛలో అమలాపురంలో భాగంగా వస్తే తమను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. తామేమైనా తీవ్రవాదులమా? అని ప్రశ్నించారు. న్యాయం జరగాలని శాంతియుతంగా వస్తే.. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని, ఎక్కడికి తీసుకువెళుతున్నారో కూడా తెలియదని అన్నారు. హిందువులు చేసిన తప్పేంటని ఆమె ప్రశ్నించారు. దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here