Home Entertainment జగన్ ఊ అంటే సీమలో ఉప ఎన్నికకు ఆ ఎమ్మెల్యే రెడీ

జగన్ ఊ అంటే సీమలో ఉప ఎన్నికకు ఆ ఎమ్మెల్యే రెడీ

396
0

జగన్ అంటే డేరింగ్ పర్సనాలిటీ అంటారు. ఆయన దేనికీ అసలు వణకరు అని కూడా చెబుతారు. జగన్ కి జనాల మీద ఎంతో నమ్మకం అని అంటారు. అటువంటి జగన్ కొన్ని విషయంలో పోకడలు మత్రం అచ్చం టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను వైసీపీ వైపుగా నడిపిస్తున్న జగన్ టెక్నికల్ గా మాత్రం ఫిరాయింపు దెబ్బ లేకుండా చూసుకుంటున్నారు. తన పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వస్తే వారు కచ్చితంగా ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి రావాలని జగన్ కండిషన్ పెట్టారు. అయితే ఆ కండిషన్ లోనే చిన్న లొసుగు కూడా పెట్టారు. వారి కుటుంబ సభ్యులు పార్టీలో చేరితే మాత్రం కండువా కప్పుతారుట. ఆ విధంగా ఇండైరెక్ట్ గా వారిని పార్టీలోకి తెస్తున్నారన్నమాట.

కొత్త విధానంగా….?

ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బ తీసేవి ఫిరాయింపులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ చట్టానికి తూట్లు పొడవడానికి సవాలక్ష మార్గాలు ఉన్నాయి. చంద్రబాబు అయితే వైసీపీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పేసి తన పార్టీలో చేర్చేసుకున్నారు. వారి మీద వైసీపీ అనర్హత పిటిషన్లు స్పీకర్ కి ఇచ్చినా అయన ఏ నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెట్టి ఉంచారు. ఇక వారిని మంత్రులుగా చేసి మరీ బాబు ఎంత అడ్డంగా వెళ్ళలో అంతలా వెళ్ళారు, ఇపుడు జగన్ ఆయన కంటే నాలుగాకులు ఎక్కువ చదివారు అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలను తాను తీసుకోను అంటూనే వారి కుటుంబ సభ్యులకు వరసపెట్టి కండువాలు కప్పుతున్నారు. అలా కొడుకులు, తమ్ముళ్ళు, ఇతర‌ బంధువులతో వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి సపోర్టర్లుగా మారుతున్నారు.

ఎటూ కాకుండా అలా….?

ఇది జగన్ వరకూ నైతిక నిష్ట పాటిస్తున్నట్లుగా ఉన్నా కూడా టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం బాగా ఇబ్బందిగానే ఉందిట. వారు అటు టీడీపీ ఎమ్మెల్యేలుగా లేరు, ఇక వైసీపీ కండువా కప్పుకోలేదు కాబట్టి అధికార పార్టీలో క్యాడర్ వారికి దూరం జరుగుతోంది. ఈ గొడవ భరించలేక‌ తాము అధికార పార్టీ నుంచి పోటీ చేస్తాం మహా ప్రభో అని జగన్ కి విన్నపాలు చేసుకుంటున్నారుట. ఆ విధంగా విజయవాడకు చెందిన వల్లభనేని వంశీతో పాటు, విశాఖ నుంచి వైసీపీకి మద్దతు ఇచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్ ఉప ఎన్నికలకు రెడీ అంటున్నారు. సరేనంటే కరణం బలరాం కూడా పోటీకి కొడుకుని దింపుతాను అంటున్నారు. ఇక గుంటూరు ఉంచి గెలిచిన మద్దాల గిరి విషయంలో కొన్ని డౌట్లు ఉన్నాయి. సరే ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మాత్రం వారిని రాజీనామా చేయవద్దని వారిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఉప ఎన్నికలు వస్తే లేనిపోని తలనొప్పి అని జగన్ భావించడమే ఇందుకు కారణం అంటున్నారు.

రివర్స్ కండిషన్…..

ఇక రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో టీడీపీకి మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే తాను వైసీపీలో చేరిపోతానని రాయబారాలు పంపుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన జగన్ కే రివర్స్ లో కండిషన్ పెడుతున్నారు అంటున్నారు. తాను టీడీపీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వస్తానని, ఉప ఎన్నికలో వైసీపీ నుంచి గెలిచి సత్తా చాటుతానని అంటున్నారుట. తనకు కంప్లీట్ గా అధికార పార్టీ మెంబర్ కావాలని ఉందని అంటున్నారుట. అవును ఆయన అసోసియట్ మెంబర్ గా ఉంటే ఉపయోగం లేదనుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే మంత్రి రేసులోకి రావచ్చునని ఆశపడుతున్నారుట. ఆయనకు మంత్రి కావాలని ఉందని అందుకే గోడ దూకుడుకు రెడీ అంటున్నారని వినిపిస్తోంది. మరి ఆయనకు జగన్ సై అంటే చాలా ఉప ఎన్నికలు ఏపీలో వచ్చేస్తాయి. దాంతో జగన్ డైలామా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here