Home Entertainment జగన్ ఇంట్లో విషాదం…

జగన్ ఇంట్లో విషాదం…

334
0

వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మామ వై ఎస్ భారతి తండ్రి చిన్న గంగిరెడ్డి శనివారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. పులివెందులలో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించి పేదల వైద్యుడిగా గంగిరెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక గంగిరెడ్డి మృతితో జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతిక కాయాన్ని పులివెందుల తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు స్వగ్రామమైన గొల్లల గూడూరు గంగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here