Home Entertainment జక్కన్న కష్టాలు చూసారా?

జక్కన్న కష్టాలు చూసారా?

122
0

ఆరు నెలలుగా షూటింగ్స్ అన్నిటికి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడిప్పుడే భారీ బడ్జెట్ మూవీస్ కూడా మెల్లగా సెట్స్ మీదకెళుతున్నాయి. అన్నింటా భారీ గా ఉన్న మూవీ, క్రేజీ మూవీ పాన్ ఇండియా మూవీ అయిన RRR షూట్ కూడా మొదలైంది. నిన్నటినుండి RRR టీం క్రేజీ అప్ డేట్ ఇవ్వబోతున్నామంటూ ఊరించి మంగళవారం ఉదయం 10.30 నిమిషాలకు RRR నుండి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. ఆ అప్ డేట్ లో RRR కోసం రాజమౌళి ఎన్ని కష్టాలు పడుతున్నాడో కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. RRR సెట్స్ ని ఓపెన్ చేసిన దగ్గరనుండి.. సెట్ లో అన్ని వస్తువులు దుమ్ము దులుపుతూ.. సెట్ ని క్లీన్ చేస్తూ కడగడమే కాదు.. సెట్ అంతటిని శానిటైజ్ చెయ్యడం దగ్గరనుండి టెక్నీకల్ సిబ్బంది మాస్క్ లు ధరించి పనులు పంచుకోవడం వరకు అన్నిటిని వీడియో రూపం లో జక్కన్న క్లారిటీ ఇచ్చేసాడు. #WeRRRback అంటూ హాష్ టాగ్ తో ఆ వీడియో ని షేర్ చేసారు.

ఇక ఎన్టీఆర్ దగ్గరనుండి రామ్ చరణ్ వరకు RRR షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే అతృతతో ఉండడంతో.. జక్కన్న కమాన్ రెడీ to షూట్ అనగానే ఆ వీడియో చివరిలో ఒక హీరో గుర్రం మీద, ఒక హీరో బైక్ మీద రావడాన్ని చూపించిన జక్కన్న హీరోలను మాత్రం దాచేసాడు. ఇక దసరా కి అంటే అక్టోబర్ 22 న ఎన్టీఆర్ రామరాజు బీమ్ ని పరిచయం చెయ్యబోతున్నాట్టుగా జక్కన్న ప్రకటించేశాడు. అయితే రాజమౌళి ఈ సినిమాని 300 కోట్ల బడ్జెట్ పైనే పెడుతున్నాడు. నిర్మాత దానయ్య కూడా ఎక్కడా తగ్గకుండా బడ్జెట్ పెట్టుకుంటూ వస్తున్నాడు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబో పై దేశం మొత్తం ఉత్సుకతతో ఉంది. మరి కరోనా తో ఆగిన షూటింగ్ మల్లి ఇన్నాళ్ళకి తగిన జాగ్రత్తల మధ్యన షూటింగ్ మొదలవడంతో ఆ విషయాన్నీ రాజమౌళి ఇలా వీడియో రూపంలో షేర్ చెయ్యడంతో ఎన్టీఆర్ – చరణ్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here