Ram Gopal Varma : ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మందుండే రామ్ గోపాల్ వర్మ ‘దిశా’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని దిశ తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు
Ram Gopal Varma : ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మందుండే రామ్ గోపాల్ వర్మ ‘దిశా’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు వర్మ. ఆయన ఇప్పటికే పలు రాజకీయ, క్రైం అంశాలనీ వెండితెరపై చూపించాడు. 2019 నవంబర్‌లో హైదరాబాద్’లో జరిగిన దిశా అత్యాచార, హత్య సంఘటన నేపథ్యంలో ఈ తాజా సినిమా తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇక దిశా ఘటన విషయానికి వస్తే.. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు మానవ మృగాలు ఒక యువతిపై అత్యంత పైశాచికంగా దాడి చేసి హత్య చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన.. ఆ తర్వాత జరిగిన నిందితుల ఎన్కౌంటర్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ‘దిశా ఎన్కౌంటర్’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించాడు.