Home Entertainment బెజవాడ దుర్గమ్మ జగన్ పై ఆగ్రహిస్తోందా

బెజవాడ దుర్గమ్మ జగన్ పై ఆగ్రహిస్తోందా

192
0

ఏమిటో ఈ మధ్యన అస్సలు సరిగా ఉండటం లేదు. ఊహించని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మాటకు వస్తే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ వినని ఉదంతాలు వరుస పెట్టి చోటు చేసుకోవటం షాకింగ్ గా మారుతోంది. రోజుల వ్యవధిలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్న వైనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని.. జగన్ అభిమానులకు కొత్త కంగారును తెప్పిస్తున్నట్లు చెబుతున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. వర్షాలు పడటం కాసింత ఆలస్యమైనా.. తుపాన్లు లాంటివి వచ్చి పడితే.. అదంతా బాబు కాలు మహిత్యంగా ప్రచారం చేసిన వారైతే.. ఇటీవల కాలంలో వరుస పెట్టి చోటు చేసుకుంటున్న వైనాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా చెబుతున్నారు.

మొన్నటికి మొన్న బెజవాడ కనక దుర్గమ్మ అమ్మవారి వద్దకు వెళ్లే టైంకు కాస్త ముందుగా.. కొండ చరియలు విరిగిపడటంతో అధికారులు షాక్ అయ్యారు. మరికాసేపట్లో సీఎం జగన్ పర్యటన ఉండటంతో.. అక్కడ రాకపోకల్ని బంద్ చేశారు. అంతలోనే ఈ ఉదంతం చోటు చేసుకోవటం.. ఆ టైంలో రోడ్ల మీద ఎవరూ లేకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో కురుస్తున్న వానలు కొంత సంతోషాన్ని ఇస్తున్నా.. అవన్నీ ఇప్పుడు ఆవిరి అయ్యే దుస్థితి. వరుస పెట్టి కొడుతున్న వర్షాలు.. ఇప్పుడు ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. పడాల్సినంత వర్షం పడితే ఫర్లేదు. అందుకు భిన్నంగా అదే పనిగా కురిసే వానతో కొత్త కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. ఇది కూడా ఇబ్బందిగా మారింది.

ఇలాంటివి సరిపోనట్లు.. ఎప్పుడూ లేని రీతిలో తాడేపల్లి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోవటం అక్కడి వారికి షాకింగ్ గా మారింది. గతంలో ఎప్పుడూ ఇలాంటిది చోటు చేసుకోలేదంటున్నారు. హటాత్తుగా శుక్రవారం మధ్యాహ్నం.. తాడేపల్లి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోవటంతో అక్కడి గ్రామస్తులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కారణం..ఇదే మార్గం గుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసానికి వెళుతుంటారు. అలాంటి రోడ్డు హటాత్తుగా.. పెద్ద శబ్దంతో కుంగిపోవటం.. ఆ సమయంలో భూమి కంపించినట్లుగా మారటంతో స్థానికులు హడలిపోయారు.

ఇది జరిగిన కాసేపటికే.. అదే మార్గంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల  రామక్రిష్ణారెడ్డి వెళుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయన అధికారులకు ఫోన్ చేయటంతో.. ఉరుకులు, పరుగులు తీస్తూ అక్కడికి వచ్చారు. వెంటనే రిపేర్లు షురూ చేశారు. ఇలా ఇటీవల చోటు చేసుకుంటున్న ఉదంతాలు.. ఏమైనా సంకేతాలు ఇస్తున్నట్ల? అన్న ప్రశ్న ఇప్పుడు జగన్ అభిమానుల్ని వేధిస్తోంది.

తిరుమల శ్రీవారి ఆస్తుల అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో ఉన్న భారీ బంగారం నిల్వల్ని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తరలించటం.. వాటిని సెక్యురిటీగా (?) చూపిస్తూ.. భారీ ఎత్తున నిధుల సేకరణ జరుగుతుందన్న ప్రచారం జరగటం.. ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటం తెలిసిందే. ఒక అంశంపై తీవ్రమైన వాదనలు చోటు చేసుకుంటున్న వేళ.. వరుసగా జరుగుతున్న ఉదంతాలు ఏదో సంకేతాల్ని ఇస్తున్నట్లుగా భావించాలన్న మాట వినిపిస్తోంది.

‘ఏదో చెబుతున్నట్లుగా అనిపిస్తోంది. ఎప్పుడూ లేనివి ఇప్పుడే ఎందుకు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాల మీద మరింత ఫోకస్ చేయాలి’’ అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏమైనా.. వరుస పెట్టి చోటు చేసుకుంటున్న వైనాలు కలతకు గురి చేస్తున్నాయి.మరి.. ఒక్కసారి విషయాల్ని పున:సమీక్షించుకుంటే మంచిదన్న మాట వినిపిస్తోంది. ఆ తర్వాత ఏలికల ఇష్టం. ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here