Home Entertainment GHMC నామినేష‌న్ల‌కు నేడే ఆఖ‌రు రోజు!

GHMC నామినేష‌న్ల‌కు నేడే ఆఖ‌రు రోజు!

167
0

గ‌తంలో కంటే ఉత్కంఠ‌గా మారిన గ్రేట‌ర్ ఎన్నిక‌లకు ‌నామినేష‌న్ గ‌డువు నేటితో ముగుస్తోంది. నామినేష‌న్ల దాఖ‌లుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ మొత్తం మూడు రోజుల గ‌డువు ఇచ్చింది. ఈ మేర‌కు నామినేష‌న్ ప్ర‌క్రియ ఈ నెల 18న మొద‌లుకావ‌డంతో.. షెడ్యూల్ ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముగియ‌నుంది.

ఇప్పటికే సీటు క‌న్ఫామ్ కాక‌పోయిన‌ప్ప‌టికీ.. ప్రధాన పార్టీలకు చెందిన చాలా మంది అభ్యర్థులు ఎలాగైనా త‌మ‌కే బీ ఫాం వ‌స్తుంద‌న్న ఆశ‌తో నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్ప‌టిర‌కు 537 మంది అభ్య‌ర్థులు 597 నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఇందులో టీఆర్ఎస్ -195, బీజేపీ -140, కాంగ్రెస్ -68, టీడీపీ -47, ఎంఐఎం -27, సీపీఎం -5తో పాటు వంద మందికిపైగా స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఇవాళ చివరి రోజు కావడం, పార్టీలు అభ్య‌ర్థుల‌కు సంబంధించిన‌ మిగిలిన జాబితాల‌ను విడుద‌ల చేయనుండ‌‌టంతో నామినేషన్లు భారీ సంఖ్య‌లో దాఖలయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here